టాటా గ్రూప్ కీలక ముందడుగు.. 50,000 ఉద్యోగులకు ఏఐలో శిక్షణ
- యూఎస్ ఏఐ సంస్థ ఆంథ్రాపిక్‌తో టీసీఎస్ గ్లోబల్ పార్ట్నర్షిప్
- 50,000 మంది ఉద్యోగులకు క్లాడ్ ఏఐ మోడల్‌పై ప్రత్యేక శిక్షణ
- క్లాడ్ ఏఐ సొల్యూషన్స్ అందించేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్ ఏర్పాటు
- ఎంటర్ప్రైజ్ ఏఐలో భారత యువతకు నైపుణ్యాలు అందించడమే లక్ష్యమన్న చంద్రశేఖరన్
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో భారీ ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంథ్రోపిక్' (Anthropic)తో గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా తమ సంస్థలోని 50,000 మంది ఉద్యోగులకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన 'క్లాడ్' (Claude) ఫ్యామిలీ ఏఐ మోడల్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఎంటర్ప్రైజ్ స్థాయిలో ఏఐని విస్తృతంగా స్వీకరించే వ్యూహంలో ఇది ఒక కీలకమైన అడుగు అని టీసీఎస్ పేర్కొంది.
ఈ భాగస్వామ్యం ద్వారా క్లాడ్ ఏఐ మోడల్స్‌పై పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్ అందించేందుకు టీసీఎస్ ఒక ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, లైఫ్ సైన్సెస్ వంటి అత్యంత నియంత్రిత పరిశ్రమలలో ఏఐ ప్రాజెక్టులను కేవలం ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి దశకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ అందిస్తున్న పాలన, నియంత్రణలు, అమలులో ఉన్న నైపుణ్యాలను క్లాడ్ ఏఐ సామర్థ్యాలతో కలపడం ద్వారా సంస్థలు ప్రయోగాలకే పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసంతో ఏఐని వాస్తవ వినియోగంలోకి తేగలవని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఒప్పందం టీసీఎస్ ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లు, డొమైన్-స్పెసిఫిక్ సొల్యూషన్స్‌కు కూడా విస్తరించనుంది. ఉదాహరణకు యూకేలో 22 మిలియన్ల కస్టమర్లకు సేవలు అందిస్తున్న టీసీఎస్ అనుబంధ సంస్థ 'డైలిజెంటా', కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి క్లాడ్‌ను ఉపయోగించుకోనుంది. అదేవిధంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (బీఎఫ్ఎస్ఐ) బృందాలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ కార్యకలాపాలలో ఉత్పాదకతను పెంచుకోవడానికి 'క్లాడ్ కోడ్' టెక్నాలజీని వినియోగించుకుంటాయి.
ఈ భాగస్వామ్యంపై టీసీఎస్ సీఈవో, ఎండీ కె. కృతివాసన్ మాట్లాడుతూ.. "వ్యాపార అవసరాలను అర్థం చేసుకోవడం, సంక్లిష్ట వ్యవస్థలను సమన్వయం చేయడం, లోతైన ఏఐ ఇంజనీరింగ్ ప్రతిభను వర్తింపజేయడం ద్వారానే ఎంటర్ప్రైజ్ ఏఐ విలువను పొందగలం. ఈ ఒప్పందం ద్వారా మా కస్టమర్లు విశ్వసనీయత, నిబంధనలు కీలకం అయిన పరిశ్రమలలో వేగంగా ఏఐని ఉత్పత్తి దశకు తీసుకెళ్లగలరు" అని వివరించారు.
ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో డారియో అమోదీ మాట్లాడుతూ.. ఈ భాగస్వామ్యం ద్వారా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌తో తమ అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు.
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ స్పందిస్తూ.. "ఆంథ్రోపిక్ సామర్థ్యాలను టాటా గ్రూప్ విస్తృత నెట్వర్క్, విశ్వసనీయ సంబంధాలు, దేశ నిర్మాణ నిబద్ధతతో కలపడం ద్వారా, మేము ఎంటర్ప్రైజ్ పునరుద్ధరణను వేగవంతం చేస్తాం. ఏఐ యుగంలో భారత యువతకు నాయకత్వం వహించేలా అవసరమైన నైపుణ్యాలను అందిస్తాం" అని పేర్కొన్నారు.